Engagement అయిన నిమిషాల్లోనే యువతి దుర్మరణం..!
Turkey: ఎంత దారుణం. ప్రేమించినవాడు వేలికి ఉంగరం (engagement) తొడిగిన కొన్ని నిమిషాల్లోనే ఆ యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటన టర్కీలో (turkey) చోటుచేసుకుంది. యెసిమ్ అనే 39 ఏళ్ల యువతి.. తన బాయ్‌ఫ్రెండ్ నిజామెత్తిన్తో కలిసి నిశ్చితార్థం కోసం టర్కీ వెళ్లింది. ఉత్తర వెస్ట్రన్ టర్కీలోని పోలెంట్ కెపె ప్రాంతంలో 100 అడుగుల ఎత్తులో ఉంగరాలు మార్చుకుని ఫొటోలకు పోజులు ఇవ్వాలనుకున్నారు.
అయితే యెసిమ్ 100 అడుగుల పైన నిలబడి సూర్యాస్తమయం చూస్తుండగా.. నిజామెత్తిన్ కారులో ఉన్న ఫుడ్, డ్రింక్స్ తీసుకొస్తానని వెళ్లాడు. అతను సామాన్లు బయటికి తీస్తుండగానే అరుపులు వినిపించాయి. తీరా వెళ్లి చూస్తే యెసిమ్ 100 అడుగుల కొండపై నుంచి జారి లోయలో పడిపోయింది. దాంతో నిజామెత్తిన్ షాక్‌లోకి వెళ్లిపోయాడు. ఆమెను బయటికి తీయగలిగారు కానీ కొద్దిసేపటికే చనిపోయింది. అలాంటి ప్రదేశంలో ఎంగేజ్మెంట్ (engagement) చేసుకుంటే బాగుంటుంది అని వెళ్లామని కానీ తన ప్రేయసి ఇలా తనకు దూరం అవుతుందని అస్సలు అనుకోలేదని నిజామెత్తిన మీడియాకు వెల్లడిస్తూ బాధపడ్డాడు. దాంతో స్థానిక అధికారులు ఇంకెవ్వరూ ఆ ప్రదేశానికి వెళ్లకుండా బ్యాన్ చేసేసారు. ఈ కేసు విషయంపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసారు.