High Court: కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు

Hyderabad: కొత్తగూడెం (kothagudem mla election) ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు (high court) సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ (congress) తరపున గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెల్ల‌డించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని BRS తరపున పోటీ చేసిన జలగం వెంకట్ రావు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు 2018 ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు వెల్ల‌డించింది.