Tillu Square: టిల్లు అన్న‌కి ఇంకా సిగ్గురాలే..!

Hyderabad: డీజే టిల్లు (dj tillu) సినిమాతో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ (siddhu jonnalagadda) రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. విమ‌ల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నేహా శెట్టి (neha shetty)  హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా క‌ల్ట్ హిట్ అవుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలోని అట్లుంట‌ది మ‌న‌తోని అనే డైలాగ్‌ను ఇమిటేట్ చేసే రేంజ్‌లో సినిమా హిట్ అయింది. దాంతో దీనికి పార్ట్ 2 (tillu square) తీయాల‌ని ఫిక్స్ అయిపోయారు. అయితే సినిమా సెట్స్ పైకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే విమ‌ల్ కృష్ణ కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యారు. దాంతో ఈ ప్రాజెక్ట్‌ను మ‌ల్లిక్ రామ్ టేక‌ప్ చేసారు.

ఇందులో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (anupama parameshwaran) యాక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ డైలాగ్ ప్రోమో రిలీజ్ అయింది. అనుప‌మ మేక‌ప్ వేసుకుంటుంటే.. ప‌క్క‌నే టిల్లు బూట్లు క్లీన్ చేసుకుంటూ.. మ‌న‌సు విరిగిన‌ట్లుంది ఎక్క‌డ్నో. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ అని అడ‌గ‌డం.. బాయ్‌ఫ్రెండ్ ఉంటే బూట్లు వేసుకుని వెళ్లిపోతా లేక‌పోతే నిన్ను ఏసుకునిపోతా అంటూ డైలాగ్స్ వేయ‌డం హైలైట్‌గా ఉంది. టిల్లు ఫ్రెండ్ మార్క‌స్ ఇదంతా చూస్తూ.. ఇంత జ‌రిగినా ఇంకా టిల్లు అన్న‌కు సిగ్గు రాలే అనే డైలాగ్ ఇంకా ఫ‌న్నీగా ఉంది. త్వ‌ర‌లో ఈ సినిమా నుంచి టికెట్టే కొన‌కుండా అనే ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ అవ‌బోతోంది.