Gandeevadhari Arjuna: ది నేమ్ ఈజ్ దెల.. కొణిదెల..!
Hyderabad: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (varun tej) యాక్ట్ చేసిన గాండివధారి అర్జున (gandeevadhari arjuna) టీజర్‌కు ఆడియన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ టీజర్‌పై సాయి ధరమ్ తేజ్ (sai dharam tej) చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నార్మల్‌గా టీజర్ బాగుందనో.. లేదో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనో కామెంట్ చేస్తే ఫర్వాలేదు. కానీ సాయి ధరమ్ తేజ్ టీజర్‌పై కామెంట్ చేస్తూ.. ది నేమ్ ఈజ్ దెల.. కొణిదెల.. టీజర్ చాలా నచ్చింది బాబూ అని ట్వీట్ చేసారు.
అప్పుడెప్పుడో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (ram charan) యాక్ట్ చేసిన వినయ విధేయ రామ సినిమాలో రామ్.. రామ్ కొ..ణి..దె..ల అంటూ ఇన్టెన్సిటీతో చెప్పిన డైలాగ్‌కి ఆడియన్స్ నుంచి కాస్త నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. ఎంత పెద్ద హీరో అయినా తమ ఇంటి పేరును ఇలా సినిమాలో వాడుకుని డైలాగ్ చెప్పేలా చేయడం కాస్త ఓవర్ అయినట్లు ఉందని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌కి కూడా ఆల్మోస్ట్ అలాంటి రియాక్షన్ వస్తోంది. (gandeevadhari arjuna)