Pawan Kalyan: YSRCP పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయ్!

AP: YSRCP పాల‌న‌లో వృక్షాలు కూడా విల‌పిస్తున్నాయ‌ని అన్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (pawan kalyan) . కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. తమిళనాట ఈ చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారని ఏపీలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలని అన్నారు. న‌రికేసిన చెట్ల వీడియోల‌ను ట్విట‌ర్‌లో షేర్ చేసారు.