Jogi Ramesh: పవన్ పిచ్చి కుక్క.. జగన్ అన్న సింహం
AP: YSRCP నేత జోగి రమేష్ (jogi ramesh) జనసేనాని పవన్ కళ్యాణ్‌పై (pawan kalyan), TDP నేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) నోటికొచ్చిన కామెంట్స్ చేసారు. పవన్ ఓ పిచ్చి కుక్క, చంద్రబాబు చిత్తకార్తె కుక్క, నారా లోకేష్ ఊర పంది, జగన్ అన్న మాత్రం సింహం అంటూ అసభ్యకరంగా మాట్లాడారు.
“” చిత్తకార్తె రోజు కుక్కలన్నీ రోడ్లపైకి వచ్చి మొరుగుతూ ఉంటాయి. మా జగన్ అన్న మాలాంటి మైనారిటీల కోసం ఎంతో కష్టపడుతుంటే నక్కలాంటి చంద్రబాబు మాలాంటివారిని పీక్కుతింటున్నాడు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క. ఏవయ్యా పవన్ కళ్యాణ్.. పెళ్లాన్ని మార్చడం కాదు ఎన్ని పార్టీలు మార్చావ్ రా బాబూ. బీజేపీ, టీడీపీ, సీపీఐ. సీపీఎం.. పెళ్లాళనీ మారుస్తావ్ పార్టీలను మారుస్తావ్. ఈ పవన్‌కు మార్చడం అనేది వెన్నతో పెట్టిన విద్య. పవన్‌కి ఒకటి చెప్తున్నా. నువ్వు ఒక కంపెనీ పెట్టుకో. ఏ పార్టీని ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలి అనే కంపెనీని పెట్టుకో. మా అన్నయ్య జగన్.. మాకు అన్నం పెడుతున్నాడు. 45 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, మైనారిటీలకు చేయూత ఇస్తున్నాడు. 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు మా జగన్ అన్న. అలాంటిది మా అన్నను ఓడిస్తారా? ఎంత మంది వచ్చినా.. మా అన్నని టచ్ కూడా చేయలేరు. మా అన్నకి మేమున్నాం. మా వెంట్రుక కూడా పీకలేరు. ఇంత దుర్మార్గులా..? “” అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు జోగి రమేష్.