Raita: పెరుగులో ఉల్లిపాయలు వేసుకోకూడదా?
Hyderabad: బిర్యానీ, పులావ్ లాంటివి వండుకున్నప్పుడు రైతా (పెరుగు పచ్చడి) (raita) తప్పనిసరిగా చేసుకుంటాం. అది లేకుండా ముద్ద దిగదు. అయితే రైతాలో ఉల్లిపాయలు వాడకూడదని అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. ఎందుకో తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం పెరుగులో (curd) ఉల్లిపాయను (onion) అస్సలు మిక్స్ చేయకూడదట. ఈ రెండూ కలిపి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే పెరుగులో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటే.. ఉల్లిపాయలో హీట్ ఎక్కువ. సో రెండూ ఎప్పుడూ మిక్స్ చేయకూడదట. మరి మనం ఇన్నాళ్లూ రైతా తింటూనే వస్తున్నాం కదా… అనే సందేహం మీకు రావచ్చు. అది నిజమే. అయితే మీరు ఉల్లిపాయలు మిక్స్ చేసిన రైతా తిన్నప్పుడు మీ పొట్ట ఉబ్బినట్లు (బ్లోటింగ్), తిన్నది అరగనట్లు అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే.. ఉల్లి, పెరుగు కాంబినేషన్ వల్లే అని గ్రహించండి. (raita)
పెరుగు, ఉల్లిపాయ మిక్స్ చేసి తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని వార్న్ చేస్తున్నారు డాక్టర్లు. కొందరు చాలా సెన్సిటివ్ ఉంటారు. అలాంటివారికి ఏకంగా వాంతులు, విరోచనాలు కూడా అవుతుంటాయట. మరి ఎలా తినాలి అంటారా? పెరుగులో పచ్చి ఉల్లిపాయ వేసుకునే బదులు.. కాస్త వేయించి మిక్స్ చేసుకుని తింటే బెటర్ అని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఉల్లిపాయలను కాస్త వేయిస్తే అందులో ఉండే సల్ఫర్ లెవల్ తగ్గుతుంది. (raita)