Ananya Pandey: దొరికిపోయాక దాగుడుమూతలు ఎందుకో?
Mumbai: కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు చేసే ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. వారిపై ఎక్కువ ఫొటోలు, వీడియోలు, న్యూస్ రావాలని ఇలా చేస్తుంటారేమో. హీరో హీరోయిన్లు డేటింగ్‌లో ఉండటం, కలిసి డిన్నర్ పార్టీలకు వెళ్లడం చూస్తూనే ఉంటాం. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ కావాలని మీడియా ముందు కలిసే తిరుగుతూ మళ్లీ అయ్యో ఫొటోలు తీసేస్తున్నారు అంటూ ముఖాలు దాచుకోవడం ఏంటో అర్థంకాని విషయం. ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఏంటంటే.. అనన్య పాండే, (annaya pandey) ఆదిత్య రాయ్ కపూర్‌లు (aditya roy kapoor) డేటింగ్‌లో ఉన్నారట. వీరిద్దరూ కలిసి రీసెంట్‌గా ఓ ట్రిప్‌కి వెళ్లి వచ్చారు. అక్కడి ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఆ తర్వాత ఏమీ తెలీనట్లు ముంబైలో ల్యాండ్ అయ్యి ఇద్దరూ వేరే టెర్మినల్స్ ద్వారా ఎగ్జిట్ అయిపోయారు. నిన్న రాత్రి మళ్లీ ఒకే కారులో డిన్నర్‌కు వెళ్తూ మీడియాకు కనిపించారు. మీడియా ఉందని అనన్య ముఖాన్ని కవర్ చేసుకోవడం చాలా ఎంబారసింగ్‌గా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పుడు ఎందుకు ఇలా దాగుడుమూతలు ఆడతారో ఏంటో అని నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు.