Ponnam Prabhakar: అధిష్ఠానం చిన్న‌చూపు చూస్తోంది

Hyderabad: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్ (ponnam prabhakar) అనుచ‌రులు గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ (congress) ఎన్నికల కమిటీలో చోటు దక్కకపోవడంతో పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తూ, బీసీల హక్కుల కోసం కొట్లాడుతున్న తనను అధిష్టానం చిన్నచూపు చూస్తుంటే ఎలా అని సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గాంధీ భవన్లో PAC కమిటీ సమావేశంలో జరుగుతుండగా పొన్నం అనుచరులు ఆందోళ‌న చేప‌ట్టారు.