Adipurush: కేస్ వేసినవారికి క్లాస్ పీకిన సుప్రీం కోర్టు
Delhi: ప్రతి దానికీ భజన అంటే ఇదే. ఆదిపురుష్ (adipurush) గురించి ఇప్పుడు అందరూ మర్చిపోయారు. ఏదో తీయాలనుకున్నారు అది ఏదో అయిపోయింది. ఇక వదిలేయచ్చుగా. కొందరు దీనినే పట్టుకుని వేలాడుతున్నారు. ఆదిపురుష్‌కి సెన్సార్ బోర్డు U సర్టిఫికేట్ ఇచ్చిందని ఇప్పుడు సినిమా బాలేదు కాబట్టి సర్టిఫికేషన్‌లో మార్పులు చేయాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో (supreme court) పిటిషన్ వేసాడు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం క్లాస్ పీకింది. అసలు సినిమాలపై ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీపై ఎందుకింత ఓర్పులేకుండా ఉన్నారు అని ప్రశ్నించింది. సెన్సార్ బోర్డు తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం తమకు లేదని న్యాయమూర్తులు స్పష్టం చేసారు. కొన్ని సార్లు బుక్‌లో రాసింది రాసినట్లు సినిమాల్లో చూపించలేకపోవచ్చని ఆ మాత్రం దానికి సర్టిఫికేషన్‌ను మార్చేయాలని అనుకోవడం మూర్ఖత్వం అని అన్నారు.