Vishwak Sen: అది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది
Hyderabad: నో మీన్స్ నో.. ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది అని అంటున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (vishwak sen) . ఆయన ఏదో విషయంలో బాగా హర్ట్ అయినట్లున్నారు. అందుకే ఓ ట్వీట్ పెట్టారు. “” వద్దు అంటే వద్దు అనేది మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది. కాబట్టి కూల్‌గా ఉందాం. అరవడం మానుకుందాం. మనమందరం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్నే కోరుకుంటున్నాం కాబట్టి జస్ట్ రిలాక్స్ “” అని ట్వీట్ చేసారు.
అయితే అసలు దేని గురించి ఆ ట్వీట్ పెట్టారని చాలా మంది ఫ్యాన్స్, నెటిజన్స్ విశ్వక్ సేన్‌ని (vishwak sen) అడుగుతున్నారు. కానీ విశ్వక్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బహుశా ఆయన డైరెక్టర్ సాయి రాజేష్ (sai rajesh) గురించి ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేసారేమో. రీసెంట్ టైమ్స్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిన్న సినిమాల్లో బేబీ (baby) ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ యాక్ట్ చేసిన ఈ సినిమాకు సాయి రాజేష్ డైరెక్షన్ చేసారు. అయితే ఈ సినిమా స్టోరీని ఆనంద్ కంటే ముందు ఒక హీరోకి చెప్పాలనుకున్నానని, కానీ ఆ హీరో అసలు తనకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా దురుసుగా బిహేవ్ చేసాడని సాయి రాజేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డారు. బహుశా ఈ టాపిక్ గురించే విశ్వక్ సేన్ ట్వీట్ చేసినట్లున్నారు.