Pawan Kalyan: జగన్.. నిన్ను కిందకు దించేది ఇదే..!
AP: జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ ప్రభుత్వం (ap government) పవన్‌పై కేసు నమోదుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు పవన్‌కు నోటీసులు వచ్చాయి. ఈ విషయాన్ని పవన్ వెల్లడిస్తూ.. నన్ను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. గుర్తుపెట్టుకో జగన్ నీ ప్రభుత్వాన్ని కిందకి లాగేది ఇదే అని హెచ్చరించారు. రీసెంట్‌గా పవన్ వారాహి యాత్రలో భాగంగా ఏలూరు సభలో మాట్లాడుతూ. వాలంటీర్ల వల్ల దాదాపు 29 వేల మంది మహిళలు మిస్సయ్యారని షాకింగ్ కామెంట్స్ చేసారు. వారు మిస్సవ్వడానికి కారణం వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి వారి పర్సనల్ వివరాలు సేకరించడం వల్లే అని అన్నారు. కిడ్నాప్ అయిన వారిలో కేవలం 9 వేల మంది ఆచూకీ మాత్రమే తెలిసిందని మిగతా వారి వివరాలు ఇంకా రాలేదని తెలిపారు. వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ కింద వేరే ప్రాంతాలకు అమ్మేస్తున్నట్లు ఇంటెలిజన్స్ వర్గాల ద్వారా తనకు సమాచారం అందిందని అన్నారు.