Kishan Reddy: KCR… జైళ్లు రెడీ చేసుకోండి

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత నెల‌కొంది. తెలంగాణ ప్ర‌భుత్వం బాటాసింగారంలో నిర్మించిన 2 బీహెచ్‌కే ఇళ్ల‌ను ప‌రిశీలించేందుకు కేంద్ర మంత్రి, తెలంగాణ BJP అధ్యక్షుడు కిషన్ రెడ్డి (kishan reddy) హైద‌రాబాద్ వ‌చ్చారు. అయితే ఆయ‌న్ను పోలీసులు అక్క‌డికక్క‌డే అడ్డుకున్నారు. దాంతో కిష‌న్ రెడ్డి (kishan reddy) వ‌ర్షం ప‌డుతున్నా రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న వ్య‌క్తం చేసారు. ప్లీజ్ స‌ర్ అని పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా ఆయ‌న వినిపించ‌కోలేదు. కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు (bjp mla raghunandan rao) కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. KCR.. జైళ్లు సిద్ధం చేసుకోండి. మేమంతా సిద్ధం అని కిష‌న్ రెడ్డి అన్నారు.