Devara: కారంచేడు ఎపిసోడ్ ఉండ‌బోతోందా?

Hyderabad: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) న‌టిస్తున్న దేవ‌ర (devara) సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. రియ‌ల్ లైఫ్ సంఘ‌ట‌న‌ల‌ను సినిమాతో ముడిపెట్టి ఆడియ‌న్స్‌కు ఓ మంచి మెసేజ్ ఇవ్వ‌డం కొర‌టాల శివ (koratala siva) స్పెషాలిటీ. ఇప్పుడు దేవ‌ర సినిమాలో కూడా అలాంటి మార్కే ఉండ‌బోతోంది. సినిమాలో కారంచేడు మార‌ణ‌కాండ ఎపిసోడ్‌ను చూపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

ఇంత‌కీ ఏంటీ కారంచేడు ఘ‌ట‌న‌

ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో ఉన్న మ‌ద‌న‌పల్లెలోని కారంచేడులో 35 ఏళ్ల క్రితం జ‌రిగింది ఈ ఘ‌ట‌న‌. 1985 జులై 17న క‌మ్మ కులానికి చెందిన కొంద‌రు వ్య‌క్తులు మాదిగ కులానికి చెందిన‌వారిపై ఎటాక్ చేసారు. ఈ దాడిలో ఆరుగురు మాదిగ కులంవారు చ‌నిపోగా.. ముగ్గురు ఆడ‌వాళ్ల‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దాడిని ప్ర‌త్య‌క్షంగా చూసిన మాదిగ కుల మ‌హిళ‌ను నెల రోజుల త‌ర్వాత దారుణంగా హ‌త్య చేసారు. డ్రింకింగ్ వాట‌ర్ ట్యాంక్ ద‌గ్గ‌ర మాదిగ కులానికి క‌మ్మ కులానికి మ‌ధ్య జరిగిన గొడ‌వ ఈ కారంచేడు దాడికి దారితీసింది.

ఈ ఎపిసోడ్‌ని సినిమాలో చూపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంటే దేవ‌ర సినిమాలో అంట‌రానిత‌నం, కుల విబేధాలు అనే అంశాలను కొర‌టాల ట‌చ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జాన్వి క‌పూర్ (janhvi kapoor) హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ (saif ali khan) విల‌న్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు తార‌క్‌కు సంబంధించిన 6 ఎపిసోడ్స్ పూర్త‌యిన‌ట్లు టీం ప్ర‌క‌టించింది. ఈ సినిమాకు సంబంధించి వారానికో కొత్త అప్డేట్ వ‌స్తుండ‌డంతో హైప్ పెరిగిపోతోంది.