Varun Dhawan: హీరోయిన్ల‌తో ఎందుకిలా..?!

Hyderabad: హీరోయిన్ల‌తో హీరోలు ఫ్రెండ్లీగా ఉంటారు. ఉండాలి కూడా. అప్పుడే సినిమాలో వారి మ‌ధ్య ఉండే కెమిస్ట్రీ కూడా చాలా బాగా పండుతుంది. ఆ ఫ్రెండ్లీనెస్ అనేది లిమిట్ దాటితే బాగోదు. సినిమాలో యాక్ట్ చేసాం కదా రియ‌ల్ లైఫ్‌లో కూడా అలాగే ఉంటానంటే ఈడ్చి తంతారు. అది ఎంత పెద్ద హీరో అయినా స‌రే. హ‌ద్దుల్లో ఉంటేనే మంచిది. ఈ టాపిక్ బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ (varun dhawan) గురించి. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ డేవిడ్ ధావ‌న్ కుమారుడైన వ‌రుణ్ ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒక‌డిగా స్టార్‌డం సంపాదించుకున్నాడు.

అయితే వ‌రుణ్ (varun dhawan) ఇప్ప‌టివ‌ర‌కు ఏ హీరోయిన్‌నీ లైంగికంగా వేధించ‌లేదు కానీ ఫొటో షూట్స్ స‌మ‌యంలో హీరోయిన్‌తో ఫొటోలు దిగేట‌ప్పుడు మాత్రం వారి ప‌ర్మిష‌న్ తీసుకోకుండా ముద్దులు పెట్టేయ‌డాలు, వెన‌క నుంచి చెవులు కొర‌డాలు చేస్తుంటాడు. ఇలాంటి సీన్స్ సినిమాల్లో ఉన్నాయంటే అవి డైరెక్ట‌ర్ చెప్పారు కాబ‌ట్టే చేసార‌ని అనుకోవ‌చ్చు. కానీ రియ‌ల్ లైఫ్‌లో ఏంటీ ప‌నులు? న‌టి కియారా అడ్వానీతో క‌లిసి వ‌రుణ్ జ‌గ్ జ‌గ్ జియో అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. ఓ మ్యాగ‌జీన్‌కు వీరిద్ద‌రూ ఫొటోషూట్ ఇచ్చారు. సాధారణంగా ఫొటో షూట్స్ చేసే టైంలో హీరో హీరోయిన్లు కాస్త ద‌గ్గ‌ర‌గా నిల‌బ‌డండి, ఒక‌రిపై ఒకరు చెయ్యి వేయండి అని ఇలా చెప్తుంటారు.

ఒక‌వేళ ఇబ్బందికరంగా ఉంటే హీరో హీరోయిన్లు ముందే చెప్పేస్తారు. అయితే వ‌రుణ్ ధావ‌న్ అలా కాదు. కియారాతో ఫొటో షూట్‌లో ఉన్న‌ప్పుడు ఆమెను ద‌గ్గ‌రికి తీసుకుని హ‌గ్ చేసుకున్న‌ట్లు పోజ్ ఇవ్వండి అని చెప్తే.. వ‌రుణ్ ఓవ‌రాక్ష‌న్ చేసి కియారా బుగ్గ‌పై ముద్దు పెట్టాడు. దానికి కియారా కూడా షాక‌య్యారు. కానీ ఇట్స్ ఓకేలే అన్న‌ట్లు న‌వ్వి ఊరుకున్నారు. అయితే అప్ప‌టికే కియారా, సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో ప్రేమ‌లో ఉన్నారు. వ‌రుణ్ కియారాను కిస్ చేసిన వీడియో బ‌య‌టికి రావ‌డంతో సిద్ధార్థ్ కంట‌ప‌డింది. దాంతో అత‌ను కియారాపై చాలా సీరియ‌స్ అయ్యాడ‌ట‌. కిస్ చేసిన‌ప్పుడు అలా చేయ‌కు ఇబ్బందిగా ఉంద‌ని ఎందుకు చెప్ప‌లేదు అని కియారాతో గొడ‌వ‌ప‌డిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. అప్ప‌ట్లో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. (varun dhawan)

ఆ త‌ర్వాత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ప్రారంభించిన క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ కార్య‌క్ర‌మంలో వ‌రుణ్ ధావ‌న్ పాల్గొన్నాడు. అందులో స్పెష‌ల్ పెర్ఫామెన్స్ కూడా ఇచ్చాడు. డ్యాన్స్ చేస్తూ గెస్ట్ సీటులో కూర్చుని ఉన్న ప్ర‌ముఖ అమెరిక‌న్ సూప‌ర్ మోడ‌ల్ గిగి హ్యాడిడ్‌ను ద‌గ్గ‌రికి లాక్కుని ఆమెను ఎత్తుకుని స్టేజ్‌పై గిర్రున తిప్పాడు. అప్పుడు కూడా చాలా మంది నెటిజ‌న్లు అది చాలా త‌ప్పు అని కామెంట్స్ పెట్టారు. దాంతో అది ప్లాన్‌లో భాగం అని వ‌రుణ్ క‌వ‌రింగ్ ఇచ్చాడు.

ఇప్పుడు రీసెంట్ కాంట్రొవ‌ర్సీ ఏంటంటే.. వ‌రుణ్, జాన్వి క‌పూర్ క‌లిసి బ‌వాల్ అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఫొటో షూట్స్‌లో పాల్గొన్నారు. జాన్విని వెన‌క నుంచి ప‌ట్టుకుని పోజ్ ఇవ్వాల‌ని ఫొటోగ్రాఫ‌ర్ చెప్పాడు. అయితే ఇక్క‌డ కూడా వ‌రుణ్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. జాన్వి పోజ్ ఇవ్వ‌డానికి రెడీ అవుతుంటే.. ఆమెను వెన‌క నుంచి ప‌ట్టుకుని చెవి కొరికాడు. ఇది త‌ప్పు అని చెప్ప‌డానికి లేదు. ఎందుకంటే బాలీవుడ్‌లో అంద‌రూ ఇలా ఫ్రెండ్లీగానే ఉంటారు. కానీ వ‌రుణ్ ధావ‌ణ్ ఎందుకు హీరోయిన్ల‌తో ఇలా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు అనేది ప్ర‌శ్న‌. పోనీ అత‌ను సింగిలా అంటే పెళ్లి కూడా అయిపోయింది. న‌టాషా ద‌లాల్ అనే ఫ్యాష‌న్ డిజైన‌ర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలాంట‌ప్పుడు ఇలాంటి ప‌నులు చేసి ఎందుకు వివాదాలను కొనితెచ్చుకుంటున్నాడో ఆయ‌న‌కే తెలియాలి.