Pakistan Woman: హాజీ క్యాజీ అని చేతిలో క్యాబేజీ..!
Noida: ఆమెకు పబ్జీ ఆడటం వచ్చు అని తెలిసినప్పుడే వెంటనే పాకిస్థాన్‌కు (pakistan woman) పంపించేయాల్సింది. కానీ నిజంగానే ఇక్కడి వ్యక్తిని ప్రేమించిందేమో అనుకుని ఇండియాలో ఉండేందుకు అనుమతి ఇచ్చింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. పాకిస్థానీ మహిళ సీమా హైదర్ (seema haider) పబ్జీలో నోయిడా వ్యక్తిని పరిచయం చేసుకుని అతని కోసం అక్రమంగా ఇండియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నోయిడాకు చెందిన సచిన్ అనే వ్యక్తి కోసం కట్టుకున్న భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చేసింది. ఇక్కడే ఉంటానని పాకిస్థాన్‌కు వెళ్తే కొట్టి చంపేస్తారని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది.
అయితే యాంటీ టెర్రర్ స్వ్రాడ్ (ats) అధికారులు సీమాపై (seema haider) ఓ కన్నేసి ఉంచారు. రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అధికారులు అడిగే ప్రశ్నలకు సీమా ఆచి తూచి సమాధానాలు చెప్తోందట. అంతేకాదు హై లెవల్ ఇంగ్లీష్ మాట్లాడుతోందట. దాంతో అధికారులకు ఆమెపై అనుమానం మరింత రెట్టింపైంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. సీమా తండ్రి, అన్న పాకిస్థాన్ ఆర్మీలో పనిచేస్తున్నారట. దాంతో ఆమె పాక్ గూఢచారిగా అనుమానిస్తున్నారు. మరోపక్క సీమా భర్త పాకిస్థాన్ వచ్చేయ్ అని వీడియో కాల్స్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోపక్క సీమాను పాక్‌కి పంపకపోతే 26\11 తరహా దాడులు చేస్తామని ముంబై కంట్రోల్ రూంకి బెదిరింపులు వస్తున్నాయట. ఇప్పటికైనా ఆమెను పాకిస్థాన్‌కు పంపించేస్తే ఓ గొడవ వదిలిపోతుంది.