Nagababu: అరుణ.. నీకు నేనున్నా
Hyderabad: జనసేన కార్యకర్త రాయపాటి అరుణ (rayapati aruna) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసాయి. దాంతో జనసైనికులు అరుణ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అంటున్నారు. దాంతో నాగబాబు (nagababu) అరుణకు సపోర్ట్‌గా నిలిచారు.
“మా చెల్లెలు రాయపాటి అరుణ ఏ ప్రశ్న అడిగితే ఆ సమాధానం చెప్పాల్సి వచ్చిందో అర్థంచేసుకోవడానికి ట్రై చేయండి. అరుణపై అనవసరమైన కామెంట్స్ చేయకండి. అరుణ మాటలు నేను విన్నా. ఏదో ఫ్లోలో తను అలా అనేసిందే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. జనసేన కోసం నిరంతరం కష్టపడే వీర మహిళ రాయపాటి అరుణ. చెల్లెమ్మా.. నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. జనసైనికులకు నేను ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. బయటివారు కావాలనే మన పార్టీలో మన మధ్యే గొడవలు పెట్టాలని చూస్తున్నారు. వారి మాయలో పడకండి. మన పార్టీ కోసం అరుణ ఎంతో కష్టపడుతున్నారు“ అని ట్వీట్ చేసారు నాగబాబు. (nagababu)
అసలు ఏం జరిగింది?
జనసేన (janasena) రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ.. నిన్న ఓ ఛానెల్ పెట్టిన డిబేట్లో పాల్గొన్నారు. ఆమెతో పాటు అధికార పార్టీ YSRCP నుంచి సుందర రామ శర్మ పాల్గొన్నారు. సుందర రామ శర్మ జనసేన గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. దాంతో అరుణ ఆయనకు కౌంటర్ ఇచ్చే క్రమంలో.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడిందని.. కానీ చిరంజీవి వెళ్లి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారని అన్నారు. దాంతో జనసైనికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.