Alia Bhatt Ranbir Kapoor: ఫేక్ పెళ్లి చేసుకున్నారా?
Hyderabad: బాలీవుడ్ పవర్ కపుల్ ఆలియా భట్ , రణ్‌బీర్ కపూర్ ఫేక్ పెళ్లి చేసుకున్నారా? (alia bhatt ranbir kapoor) . ఈ మాట అన్నది ఎవరో కాదు. నటి కంగనా రనౌత్ (kangana ranaut). రణ్‌బీర్, ఆలియాలది నిజమైన ప్రేమ కాదని నిర్మాత కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర (brahmastra) సినిమాకు మంచి మైలేజ్ వస్తుందని వారిద్దరూ బలవంతంగా పెళ్లి చేసుకునేలా చేసాడని కంగన పెద్ద బాంబ్ పేల్చారు.
వారి పేర్లు తీయకుండా ఇన్‌డైరెక్ట్‌గా వారి గురించే ప్రస్తావిస్తూ కంగన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు. ” ఇష్టం లేకపోయినా ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరు పై ఫ్లోర్లో మరొకరు కింద ఫ్లోర్లో ఉంటున్నారు. ఇటీవల ఆ హీరో వాళ్ల అమ్మ బర్త్‌డే పార్టీకి కూడా పిలవకుండా తల్లీ, బిడ్డను దూరంగా ఉంచారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏం చేయాలో తెలీక నాకు అతను ఒకసారి కలవాలి అని నాకు మెసేజ్ కూడా పెట్టాడు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోయినా ఒక ట్రైలాజీ (బ్రహ్మాస్త్ర) సినిమా కోసం పాపా జో (కరణ్ జోహార్‌ను కంగన ఇలా పిలుస్తారు) బలవంతంగా హీరోని పెళ్లికి ఒప్పించారు. ఇప్పుడు ఈ ఫేక్ మ్యారేజీ నుంచి బయటపడాలని అతను ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇక చేసేదేమీ లేదు. మన భారత సంప్రదాయంలో ఒక్కసారి పెళ్లైతే ఇక జీవితాంతం కలిసి ఉండాల్సిందే. తప్పదు“ అని స్టోరీలో రాసారు కంగన.
తన నుంచి ఏదైనా సినిమా వస్తోందంటే.. కరణ్ జోహార్ చెప్పినట్లు పనిచేసే కొన్ని వెబ్సైట్లు తన గురించి, తనతో పాటు పనిచేసిన నటుల గురించి తప్పుగా రాస్తాయని ఆరోపించారు. తన గురించి తప్పుడు వార్తలు రాయిస్తున్నందుకు కంగన ఇలా ఫేక్ పెళ్లి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసినట్లున్నారు.