Revanth Reddy: ఇలాంటి వాళ్లు ఒక్కరు చాలు..!
Hyderabad: రాజకీయ పార్టీ ఎంత బలమైనదైనా.. దానిని ప్రజల్లో నవ్వుల పాలు చేయడానికి ఆ పార్టీలో ఎవరో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరి వల్ల పార్టీ క్రెడిబులిటీ పోతుంది. ఓటు వేయాలనుకున్నా.. ఆ ఒక్కరిని చూసి మనసు మార్చుకుంటారు జనాలు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. కాంగ్రెస్ ఎంపీ, TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) ఇదే వర్గానికి చెందుతారు. ఆయనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులంటే తమ కులం, మతం లాంటివి ఏవీ ఆలోచించకుండా అందరూ మనవాళ్లే అనే ధోరణితో ఉంటారు. ప్రజల మనసు గెలుచుకోవడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా నాలుగు మంచి మాటలు మాట్లాడతారు.
ఒక పార్టీకి చెందిన వారు మరో పార్టీని నోటికొచ్చినట్లు తిట్టుకోవడాలు మనకేం కొత్తకాదు. ఇది రోజూ జరిగే ప్రక్రియే. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన కులం మాత్రమే గొప్పదని, మిగతా కులాల వారు ఎందకూ పనికిరాని వారు అన్నట్లు మాట్లాడుతున్నారు. రెడ్ల కులం గురించే గొప్పగా చెప్పుకుంటూ ఉండే ఆయన.. తన బంధువుల్లో కూడా డబ్బుంటేనే ఇంట్లోకి రానిస్తానని లేదంటే తన గన్మెన్లు గేటు బయటే ఆపేస్తారని స్వయంగా ఆయనే ఓ సందర్భంలో వెల్లడించారు. (revanth reddy)
రెడ్ల కులానికి చెందినవారికి 10 ఎకరాలు కచ్చితంగా ఉండాలని అప్పుడే అధికారం, బలం తమ చేతుల్లో ఉంటుందని రేవంత్ అన్నారు. దాంతో ఇతర కులాల వారు రేవంత్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నేతలు, కార్యకర్తలకు కూడా రేవంత్ చేసే వ్యాఖ్యలు నచ్చడంలేదు. అతన్ని సపోర్ట్ చేసే తమకు వచ్చే సీట్లు కూడా రాకుండాపోతాయేమోనని సైలెంట్‌గా ఉంటున్నారు. (revanth reddy)
రేవంత్ రెడ్డిలాంటి వాళ్లు పార్టీలో ఉంటే ఆ పార్టీకే నష్టం. రేవంత్ చేసిన వ్యాఖ్యల గురించి హైకమాండ్‌కు తెలిస్తే ఆయన్ను TPCC అధ్యక్ష పదవి నుంచి తప్పించే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఇతరుల కులాలను మతాలను వేరు చేసి ఎప్పుడూ మాట్లాడింది లేదు. ప్రేమతో ప్రజల మనసులు, వారి ఓట్లు గెలుచుకోవాలన్నది రాహుల్ మోట్టో. దానికి వ్యతిరేకంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. (revanth reddy)
మొన్న అమెరికాలోని తానా సభకు వెళ్లినప్పుడు అక్కడి తెలుగువారితో మాట్లాడుతూ.. రైతులకు ఎనిమిది గంటల ఉచిత కరెంట్ అవసరం లేదని మూడు గంటలు ఇస్తే సరిపోతుందని అన్నారు. అక్కడ చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ ఇక్కడ పడింది. దొరికిందే ఛాన్స్ అన్నట్టు BRS నేత KTR ఇదే విషయం గురించి రోజూ ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మూడు గంటల కరెంట్ గతే పడుతుందని కాబట్టి ఎవరికి ఓటు వేస్తారో మీరే తేల్చుకోండి అని రైతులను రెచ్చగొడుతున్నారు.
రేవంత్ వల్ల తెలంగాణలో ఏమాత్రం కాంగ్రెస్‌కి ఓట్ల శాతం తగ్గినా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తథ్యం. అసలు ఇప్పుడు కూడా రేవంత్‌ను వెంటనే పార్టీ నుంచి తీసి పక్కనపెడితే కాంగ్రెస్‌కు ఓట్లు పడే అవకాశం కాస్తైనా ఉంది. మరి హై కమాండ్ ఏం ఆలోచనలో ఉందో వేచి చూడాలి. (revanth reddy)