Suriya: మా అబ్బాయి ఫొటోలు తీయకండి
Hyderabad: నటుడు సూర్య (suriya) తన కుమారుడి ఫొటోలు తీయకండి అని ఫొటోగ్రాఫర్లను రిక్వెస్ట్ చేసారు. షూటింగ్ కోసం ముంబై ఎయిర్‌పోర్ట్ వచ్చారు సూర్య (suriya). ఆయనతో పాటు కారులో తన కుమారుడు దేవ్ (dev) కూడా ఉన్నాడు. దేవ్ కారులోనే కూర్చోగా.. సూర్య ఒక్కరే దిగి ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుండగా.. నా కొడుకు ఫొటోలు మాత్రం తీయకండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసారు. అందుకు ఫొటోగ్రాఫర్లు కూడా ఓకే రోలెక్స్ అని రిప్లై ఇచ్చారు.
ముంబైలోని ఫొటోగ్రాఫర్లకు ఎన్ని మంచి వీడియోలు, ఫొటోలు తీస్తే అంత డబ్బు ఇస్తారు అక్కడి మీడియా ఓనర్లు. అందుకే వాళ్లు సెలబ్రిటీల కోసం ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తుంటారు. కారు దాకా వెంబడించి మరీ వీడియోలు, ఫొటోలు తీస్తుంటారు. అది గుర్తొచ్చి కారు దాకా వెళ్లి తన కుమారుడి ఫొటోలు తీయకండి అని సూర్య (suriya) రిక్వెస్ట్ చేసారట.