New Virus: CCHF.. ఇండియాలో మొదటి మరణం
Hyderabad: కోవిడ్ అయిపోయింది అని సంతోషించేలోపే మరో వైరస్ (new virus) దాపరించింది. ఎక్కడో యూరప్‌లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ఇండియాకీ వచ్చేసింది. రావడమే కాదు ఒకరి ప్రాణాన్ని కూడా బలితీసుకుంది. ఇంతకీ ఈ వైరస్ ఏంటంటే.. CCHF. అంటే క్రిమియన్ కాంగో హెమోర్హేజిక్ ఫీవర్. ఒక రకమైన పురుగు కుట్టడం వల్ల ఈ వైరస్ వస్తుందట. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రకటించింది.
2016లో యూరప్‌లోని స్పెయిన్‌లో ఈ వైరస్ సోకి ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే ఇప్పుడు ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్పెయిన్‌లోనే కాకుండా ఇతర యూరోపియన్ దేశాలైన రష్యా, టర్కీ, యూకేలలోనూ ఈ వైరస్ వ్యాపించినట్లు గుర్తించారు. ఈ వైరస్ సోకినవారిలో మోర్టాలిటీ రేట్ 10 నుంచి 40% ఉందని తెలిపారు.
ఇక ఇండియా విషయానికొచ్చేసరికి ఆల్రెడీ గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకి చనిపోయాడట. దాంతో ఇండియా సరిహద్దుల్లో ఈ వైరస్ విషయమై హై అలర్ట్ విధించారు. అసలు ఈ CCHF వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే.. టిక్ బైట్స్ అంటే చిన్న పురుగులు కుడితే వాటి నుంచి ఈ వైరస్ వస్తుందట. ఎక్కువగా ఈ వైరస్ సోకేది కోళ్ల ఫారం, గోర్రెల వ్యాపారాలు చేసేవారికి. ఎందుకంటే ఈ టిక్ బైట్స్ వాటి నుంచే ఎక్కువగా వస్తుంటాయి.
ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. వైరస్ సోకిన వారం రోజుల తర్వాత వాంతులు, విరోచనాలు, నీరసం, కళ్లు మంటలు, నడుం నొప్పి, వెలుతురును చూడలేకపోవడం వంటివి ఉంటాయి. ఈ వైరస్ సోకిన తర్వాత 13 రోజుల పాటు ఉంటుంది. ఇక వైరస్ రాకుండా ఉండటానికి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్లు లేవు.