Yanam: యువ‌తి ఆత్మ‌హ‌త్య‌.. పెంపుడు కుక్క ఎదురుచూపులు

Yanam: యానాంలో (yanam) గుండె చ‌లించే ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ యువ‌తి ఎదుర్లంక బ్రిడ్జ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. యువ‌తిని వెతుక్కుంటూ వెళ్లిన ఆమె పెంపుడు కుక్క బ్రిడ్జ్ ద‌గ్గ‌ర వ‌దిలిన చెప్పుల‌ను చూసి అక్క‌డ‌క్క‌డే తిరుగుతూ ఉంది. కుక్క ఏడుపు విని అటుగా వెళ్తున్న పోలీసులు ఆపి ప‌రిశీలించారు. బ్రిడ్జ్ ద‌గ్గ‌ర ఉన్న చెప్పులు చూసి ఏదో జ‌రిగింద‌ని అనుమానించారు. క్లూ ఆధారంగా పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా యువ‌తి మృత‌దేహం బ‌య‌ట‌ప‌డింది. కుక్క‌ను అక్క‌డి నుంచి ఎంత తీసుకెళ్లడానికి ప్ర‌య‌త్నించ‌గా అది క‌ద‌ల‌డంలేదు. అక్క‌డే నిద్ర‌పోతూ యువ‌తి కోసం ఎదురుచూస్తూ ఉండ‌డంతో స్థానికులు చ‌లించిపోయారు.