Sai Rajesh: సినిమాలో ల*** డైలాగ్ ఉంటే క్లాప్స్ కొడుతున్నారు
Hyderabad: బేబీ (baby) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ సాయి రాజేష్ (sai rajesh). ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ (anand devarakonda), విరాజ్ హీరోలుగా.. వైష్ణవి చైతన్య (vaishnavi chaitanya) హీరోయిన్‌గా నటించారు. మొన్న శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా అనుకోకుండా మంచి టాక్ అందుకుంది. ఇందులో హీరోయిన్ హీరోని మోసం చేసి మరో హీరోని ప్రేమించడం.. అతను మంచి వాడు కాదని తెలిసి వదిలేయండి.. ఇలా ప్రస్తుతం సమాజంలో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. దాంతో సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అయింది.
అయితే ఈ సినిమాలో ఆనంద్.. వైష్ణవిని ల** అని తిట్టే సీన్ ఒకటి ఉంది. ఇలాంటి బూతులు ఉంటే సెన్సార్ బోర్డు బీప్‌లు వేసుకోమంటోందే కానీ.. తీసేయండి అని మాత్రం చెప్పడంలేదు. ఇంకో దరిద్రం ఏంటంటే.. ఇలాంటి బూతులు ఉండే సీన్లు వచ్చినప్పుడల్లా ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారట. ఇదే విషయం గురించి సాయి రాజేష్ ఓ సందర్భంలో మాట్లాడారు. ” ఆ బూతు పెట్టడం తప్పే. కానీ సెన్సార్ బోర్డు తీసేయమని చెప్పడం లేదు. సినిమా హిట్ అయినందుకు అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఒక్క నేను వైష్ణవి తప్ప. అంటే మా ఉద్దేశం సినిమా ఫ్లాప్ అవ్వాలని కాదు. ఇలాంటి బూతులు ఉంటే లేచి మరీ క్లాప్స్ కొడుతున్నారు. అలాంటివాళ్లు నా అభిప్రాయంలో షిట్‌తో సమానం “ అని మండిపడ్డారు సాయి రాజేష్.