Pakistan Woman: ఇప్పటికీ నువ్వంటే ఇష్టమే.. వచ్చేయ్ ప్లీజ్!
Hyderabad: నోయిడా వ్యక్తితో ప్రేమలో పడి పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చేసిన మహిళ సీమా హైదర్ (pakistan woman). ఆమె భర్త సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. సీమా పాకిస్థాన్‌లో తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటోంది (seema haider). పబ్జీ ఆడటం నేర్చుకుని ఆటలో పరిచయమైన నోయిడాకు చెందిన సచిన్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతను చెప్పాడని నేపాల్ బోర్డర్ ద్వారా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించింది. విషయం తెలిసి నోయిడా పోలీసులు సీమాను, సచిన్‌ను రెండు వారాల పాటు జైల్లో పెట్టారు. ఇప్పుడు సీమా ఇక్కడే ఉంటానని పట్టబట్టింది. తన పేరు, మతం మార్చుకుంది ఇక్కడే సచిన్‌తో పాటు నివసిస్తోంది. మరోపక్క సీమా తల్లిదండ్రులు ఆమెపై పీకల దాకా కోపంగా ఉన్నారు. అసలు తనొక ముస్లిమే కాదని, ఆమెను పాక్‌లో అడుగుపెట్టనివ్వమని అన్నారు.
అయితే సీమా భర్త ఇప్పటికీ ఆమెనే కోరుకుంటున్నాడు. ఇప్పటికీ తనకు సీమా అంటే ఇష్టమని, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని అంటున్నాడు. ఇప్పటికైనా తన ప్రేమను అర్థం చేసుకుని తిరిగి పాకిస్థాన్ వచ్చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ” సీమా.. నేను నిన్న ఎంత ప్రేమిస్తున్నానో నీకూ తెలుసు. ఇండియాలో నీకు ఏమన్నా జరిగితే మన పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఎవరు బాధ్యత తీసుకుంటారు? వారి కోసమైనా పాకిస్థాన్ వచ్చేసెయ్. నాకు నీ మీద ఏమాత్రం కోపం లేదు. ఇప్పటికీ నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను ఎవ్వరూ ఏమీ అనకుండా నేను చూస్తాను. నిన్ను, పిల్లల్ని చాలా మిస్సవుతున్నాను. అంతా మర్చిపోయి మనం సౌదీ అరేబియాలో కొత్త జీవితాన్ని మొదలుపెడదాం “ అని వీడియో ద్వారా తెలిపాడు సీమా మొదటి భర్త గులామ్ హైదర్.