Poonam Kaur: పవన్ కళ్యాణ్ పేరును వాడకపోయినా…!
Hyderabad: బర్నింగ్ టాపిక్స్‌పై తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు నటి పూనమ్ కౌర్ (poonam kaur) . ముఖ్యంగా ఆమె డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (trivikram srinivas), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు (pawan kalyan) సంబంధించి ఏదైనా తప్పు ఉందంటే కచ్చితంగా ట్వీట్స్ చేస్తుంటారు. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేసి చిక్కుల్లో పడ్డారు. కొన్ని రోజులుగా పవన్.. ఏపీ వాలంటీర్ల వ్యవస్థ గురించి వారి వల్ల 18 వేల మంది ఆడవాళ్లు మిస్సయ్యారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పూనమ్ కౌర్ (poonam kaur) స్పందించారు.
“ ఆడవాళ్ల భద్రత గురించి తెగ మాట్లాడేస్తున్నవారు కొంతకాలంగా దిల్లీలో జరుగుతున్న మహిళా రెజ్లర్ల గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. సొంత లాభాల కోసం పనిచేసే ఇలాంటి లీడర్ల నుంచి జాగ్రత్తగా ఉండండి “ అని ట్వీట్ చేసారు. ఎక్కడా కూడా పూనమ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) పేరు వాడలేదు. కానీ ఆమె ఇన్‌డైరెక్ట్‌గా పవన్ గురించే ఈ ట్వీట్ పెట్టారని అందరికీ తెలుసు. దాంతో పవన్ ఫ్యాన్స్ పూనమ్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. పూనమ్ అన్నట్లు మహిళా రెజ్లర్ల గురించి పవన్ కామెంట్ చేయని మాట వాస్తవమే. కానీ ఆయన మాట్లాడనంత మాత్రాన తెలుగు రాష్ట్రంలోని మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని కాదుగా..!