Jogi Naidu: ప‌వ‌న్‌.. ఇండ‌స్ట్రీ కోసం నువ్వేం చేసావ్?

Hyderabad: ప్ర‌ముఖ క‌మెడియ‌న్ జోగి నాయుడు (jogi naidu).. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) ప్ర‌శ్నించారు. అస‌లు సినిమా ఇండ‌స్ట్రీకి ప‌వ‌న్ ఏం చేసారు అని అడిగారు. సినిమాల్లో న‌టించ‌డం, కోట్లు కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకోవడం త‌ప్ప‌ ఒక స్టూడియో అయినా క‌ట్టించారా ప‌వ‌న్ అని నిల‌దీసారు. సినిమా ఇండ‌స్ట్రీకి ఏమీ చేయ‌ని ప‌వ‌న్.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఏం చేస్తారు అంటూ ఆరోప‌ణ‌లు చేసారు. (jogi naidu)

జోగి నాయుడు (jogi naidu) లాంటి వ్య‌క్తికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) ప్ర‌శ్నించేంత ధైర్యం లేదు. ఇది YSRCP నాయ‌కుల ప‌నే అని తెలుస్తోంది. సినిమా వాళ్ల‌తోనే క్వ‌శ్చ‌న్ చేయిస్తే ప‌వ‌న్‌ని జ‌నాల్లో ఉన్న న‌మ్మ‌కం పోతుంద‌ని YSRCP ప్లాన్ వేసారేమో..! ఏదేమైనా జోగి నాయుడు అడిగింది కూడా క‌రెక్ట్ ప్ర‌శ్నే. సినిమా ఇండ‌స్ట్రీకి ప‌వ‌న్ ఇప్ప‌టివ‌ర‌కు ఏమీ చేయ‌లేదు. ఒక స్టూడియోలాంటిది కూడా క‌ట్టించ‌లేదు. మ‌రి జోగి నాయుడు అడిగిన ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ ఏమ‌ని స‌మాధాన‌మిస్తారో చూడాలి.