Ileana: బాయ్‌ఫ్రెండ్ ఎవరో చెప్పేసింది..!
Hyderabad: గోవా బ్యూటీ ఇలియానా (ileana) ఇంకో రెండు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఎప్పుడైతే ఇలియానా (ileana d cruz) తల్లి కాబోతున్న ప్రకటించారో అప్పటినుంచి అసలు మీకు పెళ్లి ఎప్పుడైంది? మీ భర్త ఎవరు? అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తాయి. వాటికి ఇలియానా (ileana d cruz) ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. అఫ్కోర్స్ చెప్పాల్సిన అవసరం కూడా తనకు లేదనుకోండి. కానీ ఫ్యాన్స్‌కి తమ ఫేవరెట్ హీరోయిన్ని సొంతం చేసుకున్న ఆ లక్కీ ఫెల్లో ఎవరో తెలుసుకోవాలని ఉంటుందిగా..! అందుకే ఇలియానా మొత్తానికి తన బాయ్‌ఫ్రెండ్‌ని ప్రపంచానికి పరిచయం చేసేసారు. నిన్న ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డేట్ నైట్‌కు వెళ్లారు.
అయితే అతని పేరు వివరాలు మాత్రం ఇలియానా చెప్పలేదు. అందరూ ఇతను కత్రినా కైఫ్ (katrina kaif) బ్రదర్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కత్రినా తన బర్త్‌డేను మాల్దీవ్స్‌లో చేసుకున్నారు. పార్టీలో కత్రినా బ్రదర్‌తో పాటు ఇలియానా కూడా కనిపించారు. దాంతో అతనే ఇలియానాకు కాబోయే భర్త అని అనుకుంటున్నారు. పైగా నిన్న కత్రినా బర్త్‌డే. అదే రోజున ఇలియానా తనకు కాబోయే భర్త ఫొటోను షేర్ చేయడంతో ఇంకాస్త క్లారిటీ వచ్చేసింది.