BJP నేత కుమారుడి దాష్టీకం.. అక్క‌చెళ్లెళ్ల‌పై అఘాయిత్యం

Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ BJP నేత కుమారుడు ఓ యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. BJP హోంమంత్రి న‌రోత్త‌మ మిశ్రాకు చెందిన డాటియా నియోజ‌క‌వ‌ర్గంలో ఈ దారుణం చోటుచేసుకుంది. యువ‌తిపై అత్యాచారం చేయ‌డ‌మే కాకుండా మైన‌ర్ అయిన ఆమె చెల్లెలి ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఆ యువ‌తి పోలీసుల‌కు స‌మాచారం అందించింది. నిందితుడిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసారు.

బాధితుల్లో ఒక‌రు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసారు. దాంతో బాధితుల‌కు స‌పోర్ట్ చేయ‌డానికి ఓ గ్రామం అంతా క‌దిలి వ‌చ్చింది. త‌న‌ను, త‌న చెల్లిని న‌లుగురు వ్య‌క్తులు కిడ్నాప్ చేసి నిందితుడి ఇంటికి తీసుకెళ్లార‌ని, అక్క‌డ త‌న‌ను రేప్ చేయ‌డ‌మే కాకుండా త‌న చెల్లిని కూడా లైంగికంగా వేధించార‌ని యువ‌తి ఫిర్యాదులో పేర్కొంది. ప్ర‌స్తుతం నిందితుడు ప‌రారీలో ఉన్నాడ‌ని, అత‌ని ఆచూకీ తెలిపిన‌వారికి రూ.10,000 రివార్డు ఇస్తామ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు.