Aadhaar Card: కుక్కలకీ ఆధార్ కార్డులు..!
Mumbai: భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ (aadhaar card) తప్పనిసరి. ఆధారే మన గుర్తింపు ఆధారం. అయితే ఓ మంచి మనసున్న వ్యక్తి వీధి కుక్కలకు కూడా ఆధార్ చేయించాడు. ఎందుకో తెలిస్తే మీరూ మెచ్చుకోకుండా ఉండలేరు. ముంబైకి చెందిన అక్షయ్ అనే వ్యక్తికి వచ్చింది ఈ ఆలోచన. తను ప్రాణంగా పెంచుకున్న కుక్క (aadhaar for dogs) అనారోగ్యంతో చనిపోయిందట. అప్పటినుంచి వీధి కుక్కలపై ప్రేమ పెంచుకున్నాడు. వాటి కోసం తన వంతు ఏదైనా సాయం చేయాలనుకున్నాడు. అప్పుడే అక్షయ్ ఓ ఇంగ్లీష్ మీడియా రాసిన అర్టికల్ చదివాడట.
ముంబైలోని ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముందు ఉంటున్న కుక్కలను రీలొకేషన్ చేస్తున్నారని ఆ ఆర్టికల్‌లో రాసారు. దాంతో వాటి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకుని మరీ క్యూఆర్ కోడ్‌తో వాటి కోసం ఆధార్ కార్డులు (aadhaar card) డిజైన్ చేయించాడు. ఆ కార్డులను కుక్కల మెడలోని బెల్టులకు తగిలించాడు. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే ఆ కుక్కకు వ్యాక్సిన్ వేసారా, దాని ఓనర్ ఎవరు, ఏ ప్రాంతంలో నివసిస్తోంది అనే వివరాలు తెలిసిపోతాయి. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటున్న కుక్కలకు ఆధార్ కార్డులు వేసారు. ఇది సక్సెస్ అయితే మిగతా ప్రాంతాల్లోనూ ఈ తరహా కార్డులు (aadhaar for stray dogs) తయారుచేయిస్తానని అంటున్నాడు.