Jeevitha Rajasekhar: ర‌జినీకాంత్ కోస‌మే ఒప్పుకున్నా

Hyderabad: దాదాపు 32 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లో క‌నిపించ‌బోతున్నారు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్, న‌టి జీవిత రాజ‌శేఖ‌ర్ (jeevitha rajasekhar). సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్  (rajinikanth)నటిస్తున్న లాల్ స‌లామ్ (laal salaam) సినిమాలో జీవిత కీ రోల్‌లో న‌టించారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది రజినీ కూతురు ఐశ్వ‌ర్య‌ (aishwarya rajinikanth). అయితే ఇందులో ఓ క్యారెక్ట‌ర్‌కి జీవిత (jeevitha rajasekhar)అయితేనే బాగుంటార‌ని ఐశ్వ‌ర్య అప్రోచ్ అయ్యార‌ట‌. ఇన్నేళ్ల కెరీర్‌లో ర‌జినీతో ఎప్పుడూ న‌టించే అవ‌కాశం రాలేద‌ని అందుకే ఆయ‌న కోసం ఒప్పుకున్నాన‌ని అన్నారు. అయితే ముందు ముందు ఇంకా సినిమాల్లో న‌టిస్తారా అని జీవిత‌ను అడిగితే.. ఇప్ప‌టికైతే త‌న భర్త రాజ‌శేఖ‌ర్, కూతుళ్లు శివానీ, శివాత్మిక‌ల కెరీర్‌పైనే దృష్టిపెట్టాన‌ని అంటున్నారు.