Sitara: ఆ యాడ్‌కి అంత తీసుకుందా?
Hyderabad: సూపర్‌స్టార్ మహేష్ బాబు (mahesh babu) కూతురు సితార (sitara) ఆల్రెడీ సూపర్‌స్టార్ అయిపోయింది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్వ్కేర్ బిల్డింగ్‌పై సితార్ చేసిన యాడ్స్ వేయడం వైరల్‌గా మారింది. 11 ఏళ్ల సితారను PMJ జువెల్స్ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్‌ని చేసింది. అలా ఫస్ట్ టైం సితార (sitara) నగలు వేసుకుని కమర్షియల్ యాడ్‌లో పాల్గొంది. ఆ యాడ్‌ను టైమ్స్ స్వ్కేర్ బిల్డింగ్‌పై డిస్ప్లే చేసారు. అయితే ఈ యాడ్ కమర్షియల్ చేయడానికి సితారకు (sitara) PMJ ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ స్టార్ కిడ్కి కూడా ఫస్ట్ కమర్షియల్ యాడ్కే అంత పేమెంట్ ఇచ్చి ఉండరు. సితారకు (sitara) ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. డ్యాన్స్ వీడియోలు, ట్రిప్ ఫొటోలు ఇలా సితార అన్నీ ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటూ ఉంటుంది.