Rest In Space: ఇక స్పేస్‌లోకి మ‌నుషులు కాదు.. అస్తిక‌లు వెళ్తాయ్‌!

Houston: అదేదో సినిమాలో పిచ్చోళ్ల గురించి విన‌డ‌మే కానీ చూడ‌టం ఇదే మొద‌టిసారి అని బ్ర‌హ్మానందం అన్న‌ట్లు.. ఈ స్టోరీ చ‌దివితే నిజంగానే మ‌న‌కు పిచ్చెక్కిపోతుంది. చ‌నిపోయిన వారి అస్తిక‌ల‌ను గంగ‌లోనో లేదా ఏదైనా న‌దిలోనో క‌లుపుతారు. ఇది మన భార‌తీయ సంప్ర‌దాయం. ఇలాంటి సంప్ర‌దాయాలేవీ విదేశీయుల‌కు ఉండ‌వు. అన్ని విష‌యాల్లో ఎప్పుడూ ముందుండాల‌ని ప‌రుగులు పెట్టే అమెరికా ఈ అస్తిక‌ల విష‌యంలో ఏకంగా ఓ వెయ్యి అడుగులు ముందుకి వేసేసింది. (rest in space)

అస‌లు విష‌యం ఏంటంటే.. చ‌నిపోయిన వారి అస్తిక‌ల‌ను అమెరికా స్పేస్‌కి పంపాల‌ని ప్లాన్లు వేస్తోంది. టెక్సాస్‌కు చెందిన సెలెస్టిస్ (celestis) అనే కంపెనీకి ఈ ఆలోచ‌న వ‌చ్చింది. చాలా మందికి ఒక్క‌సారైనా స్పేస్‌కి వెళ్లి రావాల‌ని ఉంటుంది. కానీ అది అంత ఈజీ కాదు క‌దా. అందుకే బ‌తికున్న మ‌నిషి అక్క‌డికి వెళ్ల‌లేన‌ప్పుడు చ‌నిపోయిన వారి అస్తిక‌లైనా స్పేస్‌లో ఉండాల‌నేది సెలెస్టిస్ అనే స్పేస్ బ‌రియ‌ల్ కంపెనీ ఆలోచ‌న‌. (rest in space)

ప్ర‌స్తుతానికి చనిపోయిన‌ సెల‌బ్రిటీల అస్తిక‌ల‌ను ఓ క్యాప్య్సూల్‌లో పెట్టి స్పేస్‌కు పంప‌నున్నారు. వీరిలో సినీ సెల‌బ్రిటీలు జీన్ రాడెన్ బెర్రీ, జేమ్స్ దూహ‌న్, నిషెల్ నికోల్స్‌, అమెరిక‌న్ అధ్య‌క్షులు జార్జ్ వాషింగ్ట‌న్, జాన్ ఎఫ్ కెన్నెడీల అస్తిక‌లు ఉన్నాయి. మ‌రి బ‌తికున్న‌వారి సంగ‌తేంటి అనుకుంటున్నారా? సింపుల్‌.. బ‌తికున్న‌వారి నుంచి అస్తిక‌లు ఇవ్వ‌లేం కాబ‌ట్టి వారి డీఎన్ఏను సేక‌రించి క్యాప్య్సూల్‌లో పెట్టి పంపుతారు. ప్ర‌స్తుతానికి 196 క్యాప్య్సూల్స్ సిద్ధంగా ఉన్నాయ‌ట‌. (rest in space)

 

scientist showing capsule
scientist showing capsule