Allu Arvind: ఆ మాట సీరియస్‌గా తీసుకుని మా అబ్బాయినే ప్రేమించింది
Hyderabad: హీరోయిన్ లావణ్య త్రిపాఠిపై (lavanya tripathi) అల్లు అరవింద్ (allu arvind) ఫన్నీ కామెంట్స్ చేసారు. ఆనంద్ దేవరకొండ (anand devarakonda), వైష్ణవి చైతన్య (vaishnavi chaitanya) నటించిన బేబీ (baby) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అయితే యాంకర్ అల్లు అరవింద్ గురించి చెప్తూ.. ఆయన ఏదైనా అంటే అది జరిగిపోతుంది అంటూ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌ల ప్రేమ గురించి ప్రస్తావించారు. కొన్ని సంవత్సరాల క్రితం లావణ్య త్రిపాఠి ఓ ఈవెంట్లో తెలుగులో మాట్లాడుతుంటే.. అల్లు అరవింద్ మైక్ తీసుకుని ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ తెలుగులో ఎంత బాగా మాట్లాడుతోందో. ఇక్కడే ఎవరినైనా చూసుకుని సెటిల్ అయిపో అని అల్లు అరవింద్ అన్నారు. ఆ మాటలను నిజం చేస్తూ ఏకంగా మెగా వారసుడినే త్వరలో పెళ్లి చేసుకోబోతోంది లావణ్య.
ఆ వీడియోను బేబీ ఈవెంట్లో ప్లే చేసారు. దాని గురించి అల్లు అరవింద్ స్పందిస్తూ.. “నాకు లావణ్య అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి మాతో మూడు సినిమాలు చేసింది. నేనేదో ఊరికే అన్నాను ఇక్కడే ఎవరినైనా చూసుకుని చేసుకో అని. కానీ లావణ్య సీరియస్‌గా తీసుకుని మా ఇంటి అబ్బాయినే ప్రేమిస్తుంది అనుకోలేదు“ అని ఫన్నీగా అన్నారు. ఆ తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్య వైపు చూస్తూ.. నువ్వు మాత్రం తొందరపడి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోకమ్మా. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి అంటూ తన స్టైల్లో మాట్లాడారు అరవింద్.