Bandi Sanjay: కొత్త త‌ల‌నొప్పి..!

Hyderabad: క‌రీంన‌గ‌ర్ BJP ఎంపీ బండి సంజ‌య్‌కు (bandi sanjay) కొత్త త‌ల‌నొప్పి మొద‌లైంది. ఆయ‌న చేసిన పాద‌యాత్ర‌లో అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌ని లెక్కలు చెప్పాలని BJP అధిష్టానం ఒత్తిడి చేస్తున్న‌ట్లు స‌మాచారం. బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్రలో అవకతవకలు జరిగాయని పాదయాత్రలో టెంట్ హౌజ్ సామాగ్రి, కూలర్ల కాంట్రాక్ట్ సంజయ్ సోదరుడు బండి సంపత్‌కు (bandi sampath) ఇవ్వగా అందులో అన్ని తప్పుడు లెక్కలు చూపారని అధిష్టానానికి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో అన్న‌ద‌మ్ముల మెడ‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న‌ట్లు తెలుస్తోంది.