‘ఫైటర్​’ మూడో షెడ్యూల్​ పూర్తి.. హృతిక్​ రోషన్​ వీడియో వైరల్​!

బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నక్రేజీ మూవీ ఫైటర్. వార్, పఠాన్ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న సిద్ధార్ధ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘వార్’ రేంజ్ విజయం కోసం ఎదురుచూస్తున్న హృతిక్.. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. వార్‌‌ సినిమాని మించి ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌ ఉండబోతున్నాయని తెలుస్తోంది. దీపికా పదుకొనే హీరోయిన్​గా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీ షూటింగ్​ మూడవ షెడ్యూల్ తాజాగా కంప్లీట్ అయిందంటూ హీరో హృతిక్ రోషన్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

సైన్యంలో వీరమరణం పొందిన వారికి గుర్తుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు టాక్. ఈ సినిమాను ప్రకటించిన తేదీన విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి కాగా.. ఈ సినిమాలో కీలకమైన పలు యాక్షన్ సీన్లను హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌‌ఫోర్స్‌ వద్ద తెరకెక్కించారు. వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈమూవీ జనవరి 25, 2024లో ఆడియన్స్ ముందుకి రానుంది. హృతిక్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఫైటర్ మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కాగా అతి త్వరలో ఈ మూవీకి సంబంధించి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల షారుఖ్ ఖాన్ తో తెరకెక్కించిన పఠాన్ మూవీతో కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ అందుకున్న సిద్దార్థ ఆనంద్, ఈ మూవీని కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ‘పఠాన్’ మూవీ బాలీవుడ్‌లో హిందీ వెర్షన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు హిందీలో అది భారత్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా బాహుబలి2 రికార్డును ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది.

హృతిక్ రోషన్ ఈ సినిమాలో చేసే పోరాటాలు బాండ్ సినిమా లెవల్లో ఉంటాయని చెబుతున్నారు. ఇక హృతిక్ రోషన్, సిద్ధార్ధ్ ఆనంద్ కలయికలో వస్తోన్న మూడో చిత్రం. గత రెండు చిత్రాలు.. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతిలోనే ఈ సినిమా కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన దీపికా  పదుకొణే తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక హృతిక్ రోషన్ తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో ‘క్రిష్ 4’ మూవీ చేస్తున్నారు. మొత్తంగా హృతిక్ రోషన్ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇక హృతిక్, దీపికా కాంబినేషన్‌లో సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న ‘ఫైటర్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.