Posani Krishna Murali: తమ్ముడి కోసం చిరంజీవి సారీ చెప్పారు
Hyderabad: 2019 ఎన్నికల సమయంలో భీమవరంలో పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఓడిపోయింది TDP వల్లే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు YCP నేత పోసాని కృష్ణమురళి (posani krishna murali). ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పోసాని స్పందించారు. అసలు 2019 ఎన్నికల్లో పవన్ ఓడిపోయిందే TDP వల్ల అని, అతనికి ఓట్లు వేయొద్దు అని టీడీపీ రూ.15 కోట్లు ఖర్చు చేయించిన సంగతి పవన్‌కి తెలీదని అన్నారు. ఇప్పటికైనా పవన్‌లో (pawan kalyan) నైతిక విలువలు ఉంటే ఆడవాళ్లు మిస్సయ్యారు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సారీ చెప్తే దేవుడు క్షమిస్తాడని పోసాని (posani krishna murali) అన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన అన్న చిరంజీవి (chiranjeevi) క్షమాపణలు చెప్తున్నారని తెలిపారు. తెలీక పొరపాటున అన్నాడు వదిలేయండి అని చిరంజీవి పేర్ని నానికి ఫోన్లు చేసి మరీ సారీలు చెప్తున్నారని పేర్కొన్నారు. చిరంజీవి పబ్లిక్ మీటింగ్‌లో జగన్ లాగే ఎప్పుడూ ఒక్క బూతు మాట మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబు ఉన్నంతవరకు పవన్‌కు ఎమ్మెల్యే సీటు కూడా దక్కనివ్వడని పోసాని హెచ్చరించారు.