Anand Devarakonda: రష్మికతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది?
Hyderabad: విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ (anand devarakonda) బేబీ (baby) సినిమాతో రాబోతున్నారు. ఇందులో వైష్ణవి చైతన్య (vaishnavi chaitanya) హీరోయిన్గా నటించారు. సినిమా రిలీజ్ అవబోతున్న సందర్భంగా బేబీ మూవీ టీం ప్రెస్ మీట్ పెట్టింది. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్.. రష్మిక మందనతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది అని అడిగారు. దాంతో ఆనంద్కి ఒళ్లుమండింది. కానీ సినిమా రిలీజ్‌కి ముందు లేని పోని గొడవ ఎందుకని.. కాంట్రొవర్సీలు చేయడానికే ఈ ప్రశ్నలు అడుగుతున్నారా? అని కాస్త చిరాకుపడ్డారు. విజయ్ దేవరకొండ (vijay devarakonda), రష్మిక మందన (rashmika mandanna) డేటింగ్లో ఉన్నారని ఎప్పటినుంచో రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్‌కి కూడా వెళ్లారు. దాంతో వారు డేటింగ్లో ఉన్నట్లు కొందరు మీడియా ప్రతినిథులు ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ అదే నిజం అయితే.. ఆనంద్‌కు రష్మిక వదిన అవుతుంది కాబట్టి.. మెల్లిగా ఆ పాయింట్‌ని ఆనంద్‌తో చెప్పించాలని అనుకున్నారేమో. అది కాస్తా వారికే బెడిసికొట్టింది.