TDP: పొత్తుల్లేవ్..!

AP: TDP ఆల్మోస్ట్ పొత్తుల్లేవ‌ని క‌న్ఫామ్ చేసేసింది. ఎందుకంటే TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు BJPపై గుర్రుగా ఉన్నారని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. TDP, జ‌న‌సేన‌ల‌తో (janasena) పొత్తుల‌పై కేంద్ర‌మంత్రి నారాయ‌ణ స్వామి ఏవో వ్యాఖ్య‌లు చేసార‌ట‌. దాని గురించి మీ స్పంద‌నేంటి అని చంద్ర‌బాబుని అడ‌గ్గా.. ఎవరెవరో మాట్లాడిన వాటి పై స్పందించి.. చులకన కాదల్చుకోలేదని అన్నారు. ప్ర‌స్తుతం దగాపడ్డ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమ‌ని, పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణని తెలిపారు. దీనిని బ‌ట్టి చూస్తే BJPతో పొత్తు లేన‌ట్లేన‌ని అర్థ‌మైపోతోంది. మ‌రి రానున్న ఏపీ ఎన్నిక‌ల్లో TDP, జ‌న‌సేన (janasena) క‌లిసి పోరాడ‌తాయా లేదా అనేది వేచి చూడాలి.