Sleep: 8 గంట‌లు నిద్ర‌పోతున్నారా?

Hyderabad: నిద్ర (sleep) అనేది చాలా ముఖ్యం. తిండి లేక‌పోయినా త‌ట్టుకోగ‌లం కానీ నిద్ర (sleep) లేక‌పోతే మ‌నిషి ఆయుష్షు త‌గ్గిపోతుంద‌ట‌. రోజుకి కనీసం 8 గంట‌లు ప‌డుకోవాలని అంటుంటారు. అంత‌కంటే త‌క్కువ సేపు ప‌డుకుంటే ఏమ‌వుతుందో చూద్దాం.

నీర‌సం (fatigue)
8 గంట‌ల క‌న్నా త‌క్కువ సేపు ప‌డుకుంటే రోజంతా నీర‌సంగా క‌నిపిస్తుంటారు. ఆఫీస్‌కి వెళ్లేవారైతే ఒత్తిడి విప‌రీతంగా ఉంటుంది. దాని వ‌ల్ల మీరు ఏ ప‌నులూ స‌రిగ్గా చేయ‌లేరు.

ఆలోచ‌నాశ‌క్తి త‌గ్గిపోతుంది (decreased cognitive function)
అవును. 8 గంట‌ల క‌న్నా త‌క్కువ నిద్ర‌పోయేవారికి వ‌య‌సుతో సంబంధంలేకుండా ఆలోచించే శ‌క్తి కోల్పోతార‌ట‌. దీనిని కాగ్నిటివ్ ఫంక్షన్ అంటారు.

పెర్ఫామెన్స్ త‌గ్గిపోతుంది (less performance)
మ‌నం రోజంతా క‌ష్ట‌ప‌డి సంపాదించేదే తిన‌డానికి, ప‌డుకోవ‌డానికి ఆరోగ్యంగా ఉండ‌టానికి. అదే లేన‌ప్పుడు ఎంత సంపాదించి ఆఫీస్‌లో ఎంత క‌ష్ట‌ప‌డి ఏం లాభం చెప్పండి. నిద్ర‌లేక‌పోతే ఆఫీస్‌లో మీ పెర్ఫామెన్స్ కూడా త‌గ్గిపోతుంది.

మాన‌సిక రోగాలు (mental health issues)
నిద్ర‌లేక‌పోతే మాన‌సిక రోగాలు వచ్చేస్తాయి. ఒక‌టి గుర్తుపెట్టుకోండి. శారీర‌క రోగాలు ఏమైనా వ‌స్తే త‌గ్గించేందుకు మందులు, చికిత్స‌లు ఉన్నాయేమో కానీ మాన‌సిక రోగాలు వ‌స్తే మాత్రం అవి పోవ‌డానికి ఓ జీవితం స‌రిపోదు. ఎందుకంటే మీ ఆలోచ‌నా విధానం మీరు మాన‌సిక ఆరోగ్యంపై తీసుకున్న శ్ర‌ద్ధ‌ను బ‌ట్టే రిజ‌ల్ట్ ఉంటుంది.

కోపం (mood swings)
ఎవ‌రికైనా నిద్ర స‌రిపోక‌పోయినా, నిద్ర‌పోక‌పోయినా ఒక‌సారి వారిని క‌దిలించి చూడండి. చంపేసేంత కోపంతో చూస్తుంటారు. ఇందుకు కార‌ణం నిద్ర‌లేక‌పోతే మూడ్ స్వింగ్స్ రావ‌డ‌మే. అందుకే మ‌నిషి రోజుకి 8 గంట‌ల నిద్ర ఎంతో అవ‌స‌రం. మంచి నిద్ర ఉంటే మ‌నం రోజుంతా చేసే ప‌నుల్లో కూడా అంతే ప్రొడ‌క్టివిటీ ఉంటుంది.