Dhoni: CSKలో తీసుకుంటా కానీ నీకే ప్రాబ్లం!

Chennai: మహేంద్ర సింగ్ ధోనీ ప్రొడక్ష‌న్ హౌస్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ప్రొడ్యూస‌ర్‌గా (dhoni) ఫ‌స్ట్ సినిమాను కోలీవుడ్ నుంచే తీస్తున్నారు. ఈ సినిమాకు LSG (లెట్స్ గెట్ మ్యారీడ్) టైటిల్ పెట్టారు. ఇందులో హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ యోగి బాబు (yogi babu) కూడా న‌టిస్తున్నారు. నిన్న చెన్నైలో ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ జ‌రిగింది. ఈవెంట్‌కు ధోనీ త‌న భార్య సాక్షితో క‌లిసి వ‌చ్చారు.

అయితే ఈ సంద‌ర్భంగా యోగి బాబు త‌మాషాగా ఒక రిక్వెస్ట్ చేసాడు. ఇప్పుడు ఎలాగో చెన్నై సూప‌ర్ కింగ్స్‌లో (chennai super kings) అంబ‌టి రాయుడు (ambati rayudu) లేడు కాబ‌ట్టి ఆ ప్లేస్‌లో త‌న‌ను తీసుకోవాల‌ని అడిగాడు. ఇందుకు ధోనీ రిప్లై ఇస్తూ.. రాయుడు రిటైర్ అయ్యారు. అత‌ని ప్లేస్ ఖాళీగా ఉంది. కావాలంటే టీంతో మాట్లాడ‌తాను. కాక‌పోతే మీరు వ‌రుస‌గా సినిమాల‌తో బిజీగా ఉంటారు. క్రికెట్ అంటే ఎప్పుడూ ఆడుతూనే ఉండాలి. అందులోనూ మిమ్మల్ని చూడ‌గానే అంద‌రూ బౌలింగ్ వేయాల‌నుకుంటారు. ఆ బాల్‌ను మీకే తగిలేలా వేస్తారు అని త‌న‌దైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు త‌లా.