Anand Devarakonda సినిమాపై అనసూయ కామెంట్
Hyderabad: విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ (anand devarakonda) నటించిన బేబీ (baby) సినిమాపై అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) కామెంట్ చేసారు. సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన బేబీ (baby teaser) సినిమా టీజర్ రెండు రోజుల క్రితం రిలీజ్ అయింది. ఈ టీజర్ చూసిన అనసూయ ట్విటర్లో కామెంట్ పెట్టారు. ఈ సినిమా టీజర్ నిజంగా తనకు చాలా నచ్చిందని, సాయి రాజేష్ తనకు తెలిసిన కథనే తీసినట్లు అనిపించిందని అన్నారు. టీజర్లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య యాక్టింగ్ చించేసారని సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
విజయ్ దేవరకొండతో (vijay devarakonda) అనసూయకు (anasuya) జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి (arjun reddy) సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అనసూయ, విజయ్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. పైగా మొన్న విజయ్ తను నటిస్తున్న ఖుషి (khushi) సినిమా పోస్టర్లో THE విజయ్ దేవరకొండ అని రాయించుకోవడంపై కూడా అనసూయ దీనిని పైత్యం అంటారు అంటూ కామెంట్ పెట్టడం పెద్ద రచ్చకు దారి తీసింది. ఇక విజయ్‌తో తనకున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకుంటున్నట్లు అనసూయ ప్రకటించారు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ సినిమాపై అనసూయ పెట్టిన ట్వీట్‌పై కూడా చాలా మంది బ్యాడ్ కామెంట్స్ రాస్తున్నారు. అన్న అయిపోయాడు ఇక తమ్ముడిపై పడ్డావా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.