Hyderabad: భర్త ఇంటి భోజనం చేయడం లేదని భార్య ఆత్మహత్య
Hyderabad: భర్త ఇంటి భోజనం చేయడం లేదని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో (hyderabad) చోటుచేసుకుంది. బంజారాహిల్స్ (banjara hills) కాలనీ గౌరీ శంకర్ నగర్లో నివాసం ఉండే సంజీవ్, సంగీత దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా సంజీవ్ ఇంట్లో భోజనం చేయడంలేదు. దాంతో సంగీత అలిగి నిన్న రాత్రి ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.