Urine Incident: త‌ప్పు తెలుసుకున్నాడు వ‌దిలేయండి

Bhopal: రీసెంట్‌గా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో (madhya pradesh) ఓ వ్య‌క్తి ఆదివాసీపై మూత్రం పోసిన (urine incident) ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న గురించి మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు తెలీడంతో వెంట‌నే యాక్ష‌న్ తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు. నిందితుడు ప్ర‌వేశ్ శుక్లాను అరెస్ట్ చేయించ‌డ‌మే కాకుండా అత‌నిపై నేష‌న‌ల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు బుక్ చేయించారు. అంత‌టితో ఆగ‌లేదు. అత‌ని ఇంటిని కూడా కూల‌గొట్టించేసారు. ఆ త‌ర్వాత సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ (shivraj singh chouhan) బాధితుడు ద‌శ‌ర‌థ్‌ను తన ఇంటికి తీసుకెళ్లి అత‌ని కాళ్లు క‌డిగి స‌న్మానం చేసారు. అత‌నితో క‌లిసి భోజ‌నం చేసి క‌ష్టాల గురించి తెలుసుకుని అన్ని ర‌కాల సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

అయితే ఇప్పుడు ద‌శ‌ర‌థ్ మంచి మ‌న‌సుతో నిందితుడిని వ‌దిలేయాల‌ని అధికారుల‌ను కోరాడు. నిందితుడు ప్ర‌వేశ్ త‌న త‌ప్పు తెలుసుకున్నాడ‌ని అత‌న్ని వ‌దిలేయాల‌ని అన్నాడు. ఎంతైనా ఆయ‌న త‌మ గ్రామానికి పండితుడ‌ని అంటున్నాడు. ఒక‌వేళ నిజంగా త‌న‌కు న్యాయం చేయాల‌నుకుంటే త‌మ గ్రామంలో రోడ్డు వేయిస్తే చాల‌ని, ఇంత‌కుమించి ప్ర‌భుత్వాన్ని ఏమీ అడ‌గ‌న‌ని అన్నాడు. మ‌రి దీనిపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.