Naga Shaurya: కోపంతో ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయిన శౌర్య
Hyderabad: నటుడు నాగశౌర్య (naga shaurya) కోపంతో ప్రెస్ మీట్ జరుగుతుండగానే మధ్యలో లేచి వెళ్లిపోయాడు. ఆయన నటించిన రంగబలి (rangabali) సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ జర్నలిస్ట్ సినిమాలో రంగబలి అనే సెంటర్ గురించి హీరోకి తెలీకుండా ఎలా ఉంటుంది అని డైరెక్టర్‌ను అడిగారు. ఆయన అడిగిన ప్రశ్న డైరెక్టర్‌కి కూడా అర్థంకాకపోవడంతో కావాలంటే మళ్లీ మనం కలిసి సినిమా చూద్దాం సర్ అప్పుడే క్లారిటీ వస్తుంది అని అన్నారు. ఆ వెంటనే పక్కనే ఉన్న నాగశౌర్య మైక్ తీసుకుని సమాధానం చెప్పారు.
“సర్.. మీరు అడిగిన ప్రశ్న నాకు క్లియర్‌గా అర్థమైంది. సినిమాలో నా క్యారెక్టర్ 40, 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిది కాదు. ఓ యంగ్, డైనమిక్ కుర్రాడి క్యారెక్టర్. అన్నీ తనకే తెలుసు అనుకునే క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఉన్న కుర్రాడికి చరిత్ర తెలుసుకునేంత ఓపిక ఉండదు. అలాంటి పాయింట్‌తో సినిమా తీయాలనుకుంటే మా సినిమా ఓ 16 గంటలు తీయాల్సి ఉంటది. ఇక మీరు బాహుబలి గురించి అసలే అడగకండి. కొన్ని సంవత్సరాలు ఉంటది. కొన్ని అర్థంచేసుకుని వదిలేయాలి సర్“ అని చెప్పి ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. కమెడియన్ సత్య చేసిన స్పూఫ్ ఇంటర్వ్యూలకు ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెప్పారు.