Bihar: ప్రేమించిన‌వాడితో భార్య‌కు వివాహం..!

Bihar: హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్ సినిమా సీన్ బిహార్‌లో (bihar) రిపీట్ అయింది. వేరొక‌రిని ప్రేమించి త‌న‌ను ఇష్టం లేని పెళ్లి చేసుకుంద‌ని ఓ వ్య‌క్తి ద‌గ్గ‌రుండి భార్య‌కు మ‌రో పెళ్లి చేసాడు. న‌వాడా జిల్లాకు చెందిన ఓ మ‌హిళ అదే ప్రాంతానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది. అలా ఇద్ద‌రూ కొంత‌కాలం పాటు ప్రేమించుకున్నారు. కానీ అమ్మాయి ఇంట్లోవారికి వారి ప్రేమ ఇష్టం లేక బ‌ల‌వంతంగా మ‌రో పెళ్లి చేసారు. ముగ్గురు పిల్ల‌ల‌కి త‌ల్లి అయిన త‌ర్వాత కూడా ఆ మ‌హిళ ప్రేమించిన వ్య‌క్తిని మ‌ర్చిపోలేదు. భ‌ర్త లేని స‌మ‌యంలో ప్రియుడ్ని క‌లుస్తూనే ఉంది. నిన్న రాత్రి త‌న భ‌ర్త ఇంట్లో లేని స‌మ‌యం చూసి ప్రియుడ్ని క‌ల‌వ‌డానికి వెళ్లింది. అది చూసిన ఇంట్లో వారు వారిద్ద‌ర‌నీ ప‌ట్టుకుని చిత‌క‌బాదారు. పెద్ద‌ల ముందు పంచాయితీ పెట్టించారు. వారు ఊరు విడిచి వెళ్లిపోవాల‌ని తీర్పు ఇచ్చారు. అయితే ఈ విష‌యం భ‌ర్త‌కు తెలీడంతో ఆయ‌న పెద్ద మ‌న‌సుతో వారిని క్ష‌మించడ‌మే కాకుండా ద‌గ్గ‌రుండి స్థానిక శివాలయంలో పెళ్లి కూడా జ‌రిపించాడు. ప్రియుడు తాళి క‌ట్టి నుదుట బొట్టు పెడుతుంటే ఆ మ‌హిళ ఏడ్చేసింది. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్ అవుతోంది.