Ravindra Jadeja: 2009 నుంచి అన్నీ తనే..!
Hyderabad: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (ms dhoni) బర్త్‌డే సందర్భంగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (ravindra jadeja) విష్ చేసిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ధోనీని హగ్ చేసుకున్న ఫొటో పోస్ట్ చేస్తూ.. 2009 నుంచి ప్రతి విషయంలోనూ తన దగ్గరికే వెళ్లేవాడిని. హ్యాపీ బర్త్‌డే మహీ భాయ్. ఎల్లోలో మళ్లీ నిన్ను త్వరలో కలుస్తాను అని విష్ చేసారు. ఫీల్డ్‌లో ఎన్ని గొడవలు, ఇబ్బందులు ఉన్నా వాటిని పర్సనల్‌గా తీసుకోకుండా ఎప్పుడూ మహి వెంటే ఉంటాడు రవీంద్ర జడేజా (ravindra jadeja). మొన్న జరిగిన IPL మ్యాచ్‌లోనూ జడేజాకి ధోనీకి (dhoni) గ్రౌండ్లో గొడవ జరిగిందని అన్నారు. దాంతో జడేజా చాలా ఫీలయ్యాడని రూమర్స్ వచ్చాయి. కానీ IPL టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) గెలిచినప్పుడు.. లాస్ట్ బాల్‌తో టీంని జడేజా గెలిపించినప్పుడు గ్రౌండ్లో చిన్నపిల్లాడిలాగా పరిగెత్తుకుంటూ వెళ్లి జడ్డూ ధోనిని హగ్ చేసుకున్నా సీన్ ఇప్పటికీ ఫ్యాన్స్ కళ్ల ముందు మెదులుతూనే ఉంది.