YS Sharmila: KCR చేస్తున్నది సమరం కాదు.. వ్యభిచారం
Hyderabad: దిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత అడ్డంగా దొరికినా బేడీలు వేయలేదంటే.. BRS BJP ఒక్కటే అని క్లియర్గా అర్థమవుతోందని విమర్శలు గుప్పించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ (ys sharmila). KCR, BJP ఒక్కటికాదని చిన్నదొర నొక్కినొక్కి చెబుతుంటే చిన్న పిల్లవాడు కూడా నమ్మడం లేదు పాపం అంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTRను, సీఎం KCRను ట్విటర్లో దుయ్యబట్టారు.
“తెలంగాణలో లేని BJPని పైకిలేపి, ఇన్నాళ్లు విమర్శలు గుప్పించిన కేసీఆర్.. కొడుకు, కూతురు కేసులతో కథ అడ్డం తిరిగే సరికి బీజేపీతో జతకట్టాడు. కేసుల నుంచి బయట పడేందుకు కేంద్రం వద్ద మోకరిల్లాడు. ఒక్కసారిగా KCR నాలుక BJP నుంచి ఇంకో పార్టీకి మళ్లింది. తొమ్మిదేండ్లుగా విభజన హామీలపై మోడీని నిలదీయలేని BRS.. BJPకి ‘B’ టీం కాదా? రాష్ట్రానికి వచ్చే నిధుల వాటా గురించి మాట్లాడలేని KCR.. మోడీ తొత్తు కాదా? కాళేశ్వరంలో KCR రూ.వేల కోట్లు తినేసినా కనీసం విచారణ చేయించని BJP.. BRSకు మద్దతు తెలిపినట్లు కాదా? లిక్కర్ స్కాంలో KCR కూతురు అడ్డంగా దొరికినా బేడీలు వేయని BJP.. BRSను కాపాడుతున్నట్లు కాదా? BRS అంటే “BJPకి రహస్య సమితి”. BRS అంటే బరాబర్BJPకి ‘B’ టీం. BJPతో KCR చేస్తున్నది సమరం కాదు.. వ్యభిచారం” అని విమర్శించారు షర్మిళ.