Lalu Prasad Yadav: PM ఇంట్లో భార్య లేకుండా ఉండకూడదు
Delhi: ప్రధానికి కేటాయించే ఇంట్లో ప్రధాన మంత్రి భార్య లేకుండా నివసించకూడదని అన్నారు RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav). మెడికల్ చెకప్ కోసం దిల్లీ వచ్చిన లాలూ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ఇటీవల బిహార్‌లో జరిగిన అపోజిషన్ మీట్‌లో (opposition leaders meet) పాల్గొన్న లాలూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో (rahul gandhi) మాట్లాడుతూ పెళ్లి చేసుకోవాలని సూచించారు. అలా రాహుల్‌తో ఎందుకు అన్నారని లాలూని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానిస్తూ.. “ప్రధానికి కేటాయించే ఇంట్లో భార్య లేకుండా నివసించకూడదు. ఇప్పటివరకు ఉన్న ప్రధాని అలాగే నివసిస్తున్నారు. ఇకనైనా ఆ తీరు మారాలి. అందుకే రాహుల్‌ని పెళ్లి చేసుకోమని చెప్పాను“ అని తెలిపారు. దీనిని బట్టి చూస్తే రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్‌నే ప్రధానిని చేసే యోచనలో ఉన్నట్లు అర్థం అవుతోంది.
ఈసారి ఎన్నికల్లో అపోజిషన్ పార్టీలకు 300 సీట్లు కచ్చితంగా వస్తాయని లాలూ తెలిపారు. దేశంలో BJP అత్యంత అవినీతి గల పార్టీ అని మండిపడ్డారు. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నుంచి అజిత్ పవార్‌ను (ajit pawar) విడదీసి BJPలోకి చేర్చుకున్న విషయంపై మాట్లాడుతూ.. గతంలో అవినీతి ఆరోపణలు చేసినవారే ఇప్పుడు మంత్రి పదవులు కట్టబెడుతుంటే వారేంటో ఇంకా అర్థంకాలేదా అని కామెంట్ చేసారు లాలూ.