Vidya Balan: మా ఆయనతో నాది లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్
Mumbai: లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి వినే ఉంటాం. చూడగానే ప్రేమించాలి అనిపించేలా లేదా చూడగానే పడిపోయేలా ఉంటే ఈ పదం వాడతాం. కానీ బాలీవుడ్ నటి విద్యా బాలన్ది (vidya balan) మాత్రం లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను (siddharth roy kapoor) విద్యా బాలన్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన్ని చూసినప్పుడు తనకు లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగిందని చెప్తున్నారు. విద్యా బాలన్ (vidya balan) నటించిన నీయత్ (neeyat) అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా విద్యా తన వైవాహిక జీవితం గురించి వెల్లడించారు. అసలు తనకు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం అయితే లేదని అన్నారు.
“నాకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. తోడు కావాలని కోరుకున్నాను కానీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. నాకు 26 ఏళ్లు ఉన్నప్పుడు పరిణీత రిలీజ్ అయింది. 30 వచ్చేసరికి ఇండస్ట్రీలో సక్సెస్ చూసేసాను. నా సక్సెస్‌ని ఒకరితో పంచుకోవాలని అనిపించేది. అప్పుడే నేను కొందరితో డేటింగ్ చేసాను. కానీ ఎవ్వరితోనూ కంటిన్యూ చేయలేకపోయాను. దాంతో ఒంటరిగా ఫీలయ్యేదాన్ని. కానీ ఎప్పుడైతే సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని కలిసానో పెళ్లిపై నా నిర్ణయం మారిపోయింది. మా ఇద్దరికీ ఒకరినొకరు చూసుకోగానే లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగింది. అలా కొంతకాలం పాటు డేటింగ్ చేసి 2012లో పెళ్లి చేసుకున్నాం“ అని తెలిపారు విద్యా బాలన్.