Tirumala: సిగ‌రెట్ కోసం తిరుమ‌ల‌లో వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్

Tirumala: తిరుమ‌ల‌లో (tirumala) ఓ వ్య‌క్తి హ‌ల్‌చల్ చేసాడు. న‌రేంద్ర అనే వ్య‌క్తి గోగర్భం డ్యాంపై నుండి దూకేందుకు ప్రయత్నించాడు. అత‌నికి సిగరెట్ త్రాగే అలవాటు ఉండడంతో, రెండు రోజులుగా సిగరెట్ తాగేందుకు వీలు లేక పోవడంతో ఒక్కసారిగా గోగర్బం డ్యాం వద్దకు చేరుకుని ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు య‌త్నించాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన TTD విజిలెన్స్ సిబ్బంది నరేంద్రకు కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.